Followers

Wednesday, July 15, 2020

Centre released guidelines for online Classes

ఆన్‌లైన్‌ క్లాసులకు మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం  

దీని ప్రకారం

ప్రీప్రైమరీ తరగతులకు సంబంధించి తల్లిదండ్రులతో ఇంటరాక్ట్‌ అవ్వడానికి 30 నిమిషాలు,

1నుంచి 8వ తరగతుల వరకు  విద్యార్థులకు ఒక్కో సెషన్‌ 30 నుంచి 45 నిమిషాలు మించకుండా రోజుకు రెండు సెషన్స్‌ ఉండాలని,

9 నుంచి 12వ తరగతి వరకు ఒక్కో సెషన్‌ 45 నిమిషాలకు మించకుండా రోజుకు నాలుగు సెషన్లు ఉండాలని సూచించారు.

ఒకటో నుండి 12వ తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ ప్రత్యామ్నాయ అకడమిక్‌ క్యాలెండర్‌ను వాడాలని సూచించారు.

పని దినాల్లో తప్ప వారాంతాల్లో తరగతులు నిర్వహించరాదని ఆదేశించారు.

ఆన్‌లైన్‌ అసెస్మెంట్‌ నిర్వహించాలని నిర్దేశించారు.

ఆయా రాష్ర్టాల్లో ఉన్న వనరుల దృష్ట్యా షార్ట్‌ టర్మ్‌, లాంగ్‌ టర్మ్‌ ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు.

ల్యాప్‌టాప్‌, ఇంటర్నెట్‌, స్మార్ట్‌ ఫోన్‌, కేబుల్‌ కనెక్షన్‌ తో టెలివిజన్‌ ఎంతమందికి అందుబాటులో ఉంది.. అనే సమాచారాన్ని బట్టి తగిన నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు.

No comments:

Post a Comment