Followers

Thursday, July 2, 2020

DETAILS OF ISSUES DISCUSSED BY FAPTO, AT THE MEETING WITH HIGHER OFFICIALS OF SCHOOL EDUCATION DEPARTMENT ON 01-07-2020

01/07/2020న ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లాల ఫ్యాప్టో చైర్మన్లు, సెక్రటరీ జనరల్స్ కు జారీ చెసిన సర్క్యులర్‌: 11  ప్రకారం, విజయవాడలోని సమగ్రశిక్షా కార్యాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో వారు చర్చించిన అంశాల వివరాలు.

 ఆర్‌ సి 145 ఇబ్బందులు

1) ఆర్‌ సి 145 ఇబ్బందులు చెప్పడం జరిగింది. సదరు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంను అధికారులు వివరించారు. చివరికి జూలై 7 వ తేదీ నాటికి నిర్దేశించిన పనులు పూర్తవుతాయి కనుక ప్రాథమిక పాఠశాలలు వారంలో ఒక రోజు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు 50% చొప్పున రెండు రోజులు పనిచేసేలా ఉత్తర్వులు ఇస్తామన్నారు. ఈ దశలో విద్యార్ధులకు ఏవిధంగా బోధన జరపాలనే దానిపై సుధీర్చ చర్చ జరిగింది.

 రేషనలైజేషన్‌ :

1. రేషనలైజేషన్‌ లో ఇప్పటికే విడుదలైన పోస్టుల కేటాయింపు లో పెద్ద మార్పులు లేవు. ప్రాథమిక పాఠశాలల్లో రోలు 40 పైబడిన పాఠశాలలకు మూడవ పోస్ట్‌ కోసం చర్చ జరిగింది. పోస్టుల లభ్యతను బట్టి కేటాయిస్తామని, కాని పక్షంలో అకడమిక్‌ ఇనస్ట్రక్టర్లను ఇస్తామని ప్రకటించారు.

2. DEO పూల్‌లో ఉన్న పండిట్లను UP స్కూళ్ళలో సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయుల పోస్టులలో నియమిస్తారు. ప్రస్తుతం వారు పనిచేసే పాఠశాలలను బదిలీలకు ఖాళీగా చూపిస్తారు.

3. ఉన్నత పాఠశాలల్లో PS, BSలకు 280 పైన విద్యార్దులు ఉన్న చోట 2 వ పోస్టు కేటాయిస్తామన్నారు.

4. కేటగిరి పాయింట్లు: I-1, II-2, III-3, IV-5

5. సర్వీసు పాయింట్లు మనం అడిగినది ఏడాదికి 1 పాయింట్‌, త్వరలో ఖరారు అవుతుంది.

6. ప్రతీ ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులు తప్పని సరిగా 1-20 రోలు ఉన్నా కేటాయింపు లో ముందు ఉంచుతారు.

7. రేషనలైజేషన్‌ లో కదిలే ఉపాధ్యాయులకు 2 పాయింట్లు కేటాయిస్తారు.

 బదిలీలు :

 1) కనీస సర్వీసు 2 ఏళ్ళు, గరిష్టంగా 8 ఏళ్ళు, చివరిలో ఎకడమిక్‌ ఇయర్స్‌ గా చూడాలనే ప్రతిపాదన వచ్చింది.

2) స్పౌజ్‌కు 5 పాయింట్లు.

3) మిగిలిన ప్రిఫరెన్షియల్‌ కేటగిరి లు కొనసాగుతాయి. కొత్తగా హార్ట్‌ ట్రాన్స్ ప్లాంట్  జరిగిన వారిని చేర్చమని కోరాం.

4) 40% నుండి దివ్యాంగులకు ప్రిపరెన్షియల్‌ కేటగిరిలో ఉంటారు. కానీ పాయింట్లతో సంబంధం లేకుండా ఎక్కువ శాతం ఉన్నవారిని జాబితాలో ముందు ఉంచుతారు.

5) అన్‌ మ్యారీడ్‌ ప్రధానోపాధ్యాయురాలు/ ఉపాధ్యాయినులకు 6 పాయింట్లు కేటాయిస్తారు.

6) అన్ని కేడర్లకు వెబ్‌ కౌన్సెలింగ్‌ అని ప్రకటించారు. సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులకు స్వయంగా బదిలీ కోరుకునే అవకాశం పై మాట్లాడే లోపే సమావేశం ముగిసింది. ఏ విధంగా జరపాలనే దానిపై మరోసారి మాట్లాడతాం.

ఇంకా చర్చల్లో ఇతర విషయాలు వచ్చాయని ఆంటున్నారు. అవి ఫ్యాప్టో జారీ చేసిన సర్కులర్ లో ప్రస్తావించలేదు. అవి

కంటోన్మెంట్ జోన్లో నివసించే ఉపాధ్యాయులకు, పాఠశాలలకు హాజరు నుండి మినహాయింపు, బయోమెట్రిక్ తీసివేత, ఇంగ్లీష్ మీడియంకు నాలుగు పోస్టులు, బదిలీలలో హెచ్ఎంలకు ఐదు సంవత్సరాల సర్వీసు, అప్ గ్రెడేషన్ పోస్టుల గురించి, మోడల్ స్కూల్  మరియు కేజీబీవీలో కూడా బదిలీలు చేపట్టడం, HRA ఎందుకివ్వాలనే చర్చ మెదలైనవి.

DOWNLOAD FAPTO CIRCULAR

https://drive.google.com/file/d/1DxMH05YTUZwmb5_imveYYrA6Go78qO5W/view?usp=sharing



No comments:

Post a Comment