Followers

Thursday, July 2, 2020

Details of Teacher posts Rationalization issue in aided schools - Meeting with the School Education Director

 

ఎయిడెడ్ ఉపాధ్యాయు పోస్టుల సర్దుబాటు ప్రక్రియ పాఠశాలలు తెరిచేనాటికి పూర్తవ్వాలని సూచన.

విద్యార్ధులు లేక మూతపడుతున్న, లేదా ఎక్కువ మంది విద్యార్ధులు, తక్కువ మంది ఉపాధ్యాయులతో సతమతమవుతున్న ఎయిడెడ్ పాఠశాలలను గాడిలో పెట్టడానికి పాఠశాల విద్య డైరెక్టర్ (పరిపాలన) పి.పార్వతి గారి ఆధ్యర్యంలోని కమిటీ 02-07-2020  ఎయిడెడ్ పాఠశాలల మేనేజ్ మెంట్లు, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించింది. ఆ మీటింగ్ లోని ముఖ్యాంశాలు.

 

1. ఎయిడెడ్‌ విద్యాసంస్థలలో ఉపాధ్యాయు పోస్టుల సర్దుబాటును పాఠశాలల తెరిచే నాటికి పూర్తి చేయాలి.

2. ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించాలి.

౩. సర్వీసు వ్యవహారాలను డీ.ఈ.ఓ ల స్థానే ఎం.ఇ.ఓ లు చూడాలి.

4. వ్యాయామ ఉపాధ్యాయుల పదోన్నతులను వెన్వెంటనే పూర్తి చేయలి.

5. ఉపాధ్యాయ పోస్టులతోపాటు మినిస్టీరియల్‌ ఉద్యోగులను కూడా టేకోవర్‌ చేయాలి.

6.ఎయిడెడ్ పాఠశాలల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై 10 రోజుల్లో మేనేజ్మెంట్లు తమ అభిప్రాయాలు తెలియజేయాలి.


No comments:

Post a Comment